రంజీ: పృధ్వీ షా ట్రిపుల్​ సెంచరీ

By udayam on January 11th / 9:46 am IST

రంజీ ట్రోఫీలో భారత యువ బ్యాటర్​ పృధ్వి షా రెచ్చిపోయాడు. అస్సాం జట్టుపై ఏకంగా 383 బాల్స్​ లో 49 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 379 పరుగులతో ట్రిపుల్​ సెంచరీని బాదేశాడు. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 443 పరుగులతో బాబాసాహెబ్ నింబాకర్​.. షా కంటే ముందున్నాడు. తొలి రోజే డబుల్ సెంచరీ (240 పరుగులు) మార్కు దాటిన షా.. రెండో రోజు, బుధవారం కూడా అసోం బౌలింగ్ ను ఊచకోత కోశాడు. తొలి సెషన్ లోనే ట్రిపుల్ సెంచరీ మార్కు దాటాడు. అతని జోరు చూస్తుంటే నాలుగు వందల రన్స్ చేసేలా కనిపించాడు. కానీ, రియాన్ పరాగ్ ఎల్బీ డబ్ల్యూ చేయడంతో మూడో వికెట్ కు అజింక్యా రహానే (131 బ్యాటింగ్) 401 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ట్యాగ్స్​