రెండు నెలల పాటు అంటార్కిటికాలో ఫొటోలు బయల్దేరిన ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఛాన్స్ లభించింది.
అత్యంత అరుదైన పసుపు పెంగ్విన్‌ను దక్షిణ జార్జియా తీరంలో వెస్ ఆడమ్స్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించగలిగాడు.
ఇప్పటి వరకూ ఇలాంటి పెంగ్విన్‌ను తాను ఎప్పుడూ ఈ ప్రాంతంలో చూడలేదని, బహుశా ఏదైనా ప్రొటీన్ల లోపం వల్లే ఇది ఈ రంగులో ఉండిపోయి ఉంటుందని అతడు వివరించాడు.
ఈ ఫొటోల్ని అతడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.