రష్మిక వివాదాస్పద వ్యాఖ్యలు: దక్షిణాది సినిమాల్లో మసాలా పాటలే ఎక్కువ

By udayam on December 29th / 9:16 am IST

తొలి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న కన్నడ భామ రష్మిక, తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పుష్ప తర్వాత బాలీవుడ్​ కూ వెళ్ళిపోయిన ఆమె ఇప్పుడు ఛాన్స్​ ఇచ్చిన సౌత్​ ఇండస్ట్రీపై నోరు పారేసుకున్నారు. ఇటీవల దక్షిణాది చిత్రపరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయన్న ఆమె.. దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయంది. సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసింది. దీంతో రష్మికపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నెటిజన్స్.

ట్యాగ్స్​