సమంతను తాను ఓ అమ్మలా కాపాడుకోవాలనుకుంటున్నానని మరో నటి రష్మిక మందాన వ్యాఖ్యానించారు. మిషన్ మజ్ను మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పుష్ప మూవీ టైంలో కూడా సమంత, తనకు మధ్య మయోసైటిస్ గురించి ఎలాంటి చర్చా లేదని, ఆమె ప్రకటించిన తర్వాతే తనకు ఈ వ్యాధి గురించి తెలిసిదన్నారు. ఈ కష్టసమయంలో ఆమె వెన్నంటి నిలవాలనుకుంటున్నానని రష్మిక తెలిపింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి అందరూ స్ఫూర్తి పొందుతారని, ఆ విధంగా తాను కూడా సమంత నుంచి స్ఫూర్తి పొందుతానని రష్మిక పేర్కొంది.