కన్నడలో రష్మిక సినిమాలు బ్యాన్​!

By udayam on November 25th / 4:47 am IST

కెరీర్​ లో ఉన్నత స్థితికి చేరుకున్న నటి రష్మిక మందాన పై సొంత ఇండస్ట్రీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు లైఫ్​ ఇచ్చిన ప్రొడక్షన్​ హౌస్​ పేరు చెప్పడానికి వెనుకాడుతూ మాట్లాడడంపై కన్నడ సినీ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఆమె సినిమాలను కన్నడ నాట విడుదల కాకుండా బ్యాన్​ చేయాలని ప్లాన్​ చేస్తోంది. తన మాజీ లవర్​ రక్షిత్​ శెట్టికి చెందిన పరమవాహ్​ స్టూడియోస్​ ద్వారా ఆమె కిరిక్​ పార్టీ సినిమాతో స్టార్​ గా మారింది. ఆపై కొద్దిరోజులు ప్రేమలో మునిగిన ఆ జంట నిశ్చితార్ధం చేసుకుని మరీ విడిపోయింది. దీంతో అతడి పేరును, ప్రొడక్షన్​ హౌస్​ ను ఇంటర్వ్యూలో కూడా చెప్పలేకపోయిన ఆమెపై కన్నడ నాట తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ట్యాగ్స్​