సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ‘రస్నా’ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా (85) కన్నుమూశారు. శనివారంనాడు ఆయన కన్నుమూశారని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ‘ఐ లవ్ యూ రస్నా’ ప్రకటన ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ దాదాపు 60 దేశాలకు ఎగుమతి అవుతోంది. కేవలం రూ.5 ప్యాకెట్ తో 32 గ్లాసుల డ్రింక్ ను తయారు చేసుకునేలా ఈ ప్రాడక్ట్ ను అరీజ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. బెనోవోలెంట్ ట్రస్ట్ ఛైర్మన్ గా, ప్రపంచ పార్సీ ఇరానీ జొరాస్టిస్ ఛైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు.