రవిశాస్త్రివి మా వ్యూహాలే : రమీజ్​ రాజా

By udayam on September 24th / 4:55 am IST

ప్రస్తుత భారత కోచ్​ రవి శాస్త్రి గతంలో పాకిస్థాన్​ అనుసరించిన వ్యూహాలతోనే విజయాలు సాధిస్తున్నాడని పిసిబి ఛైర్మన్​ రమీజ్​ రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 1992లో పాక్​ కెప్టెన్​ ఇమ్రాన్​ ఖాన్​, అప్పటి మా జట్టు వ్యూహాల్ని ప్రస్తుతం శాస్త్రి కాపీ కొడుతున్నాడని రమీజ్​ అన్నాడు. ప్రస్తుతం మా వద్ద ఉన్న బలంతో సరితూగాలంటే భారతీయులకు మరో 3 నుంచి 4 ఏళ్ళు పడుతుందంటూ ఆయన తన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే రమీజ్​ వ్యాఖ్యలపై భారతీయులు వ్యగ్యంగా స్పందించారు. ‘ఇది బెస్ట్​ జోక్​ ఆఫ్​ ది సెంచరీ’ అని ఒకరు ట్వీట్​ చేస్తే.. ‘న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​ టూర్లు పోయాక.. బుర్ర కూడా పోయిందా’ అంటూ మరొకరు ట్వీట్​ చేశారు.

ట్యాగ్స్​