శాస్త్రి: ద్రవిడ్​ కు ఎందుకు విశ్రాంతి

By udayam on November 17th / 12:25 pm IST

రేపటి నుంచి న్యూజిలాండ్​ తో జరగనున్న టి20, వన్డే సిరీస్​ ల కోసం హెడ్​ కోచ్​ ద్రవిడ్​ కు విశ్రాంతిని ఇవ్వడంపై మాజీ కోచ్​ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ద్రవిడ్​ జట్టుతోనే ఉండాలన్న అతడు.. ఐపిఎల్​ జరిగే రెండు నెలలూ విశ్రాంతిలో ఉంటాడు కదా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. “సహాయక సిబ్బందికి విశ్రాంతి ఇవ్వడం వల్ల ఎలాంటి మెరుగైన ఫలితాలు వస్తాయో నాకర్థంకావడంలేదు. ఐపీఎల్ జరిగిన రెండు నెలల పాటు టీమిండియా కోచింగ్ స్టాఫ్ కు విశ్రాంతే కదా. ఆ విరామం చాలదా…? నేను గనుక కోచ్ స్థానంలో ఉంటే అన్ని వేళలా జట్టుతో పాటే ఉండి ఆటగాళ్లను నిశితంగా పరిశీలిస్తుంటాను” అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​