రూ.100 కోట్ల క్లబ్​ లోకి ‘ధమాకా’

By udayam on January 6th / 10:13 am IST

మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రం గురువారంతో 14 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ సంబంధిత పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగిన కథ అని.. మాస్ అంశాలే సినిమాకు హైలెట్ అనే టాక్ వినిపిస్తోంది. విడుదలైన రోజున ఈ మూవీకి మిశ్రమ టాక్​ వచ్చినా.. రవితేజ అభిమానులు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్​ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.

ట్యాగ్స్​