రూ.100 కోట్ల క్లబ్​ లోకి రవితేజ ‘ధమాకా’

By udayam on January 4th / 10:32 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్​ ధమాకా రూ.100 కోట్ల కలెక్షన్స్​ క్లబ్​ లోకి చేరిపోతుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్​ 23న విడుదలై సంచలన కలెక్షన్లను కొల్లగొడుతోంది. శ్రీలీల బ్యూటీ, ఎనర్జిటిక్​ డాన్స్​ మూవ్స్​ కు ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. ఈ పండుగకు రవితేజ మరోసారి వాల్తేరు వీరయ్య మూవీతో తన అభిమానులను పలకరిస్తుంటే.. మరో పక్క తన కొత్త చిత్రం రావణాసుర డబ్బింగ్​ ను కూడా మొదలెట్టేశాడు.

ట్యాగ్స్​