చాలా కాలం తర్వాత రవితేజ ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్న సంగతి తెలిసిందే. మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ రవితేజ ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ మూవీలో ఉన్నాయి. ధియేటర్ల వద్ద రాణిస్తునన ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ భారీగానే చెల్లించిందని టాక్. తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.