నెట్​ ఫ్లిక్స్​ లో 22 నుంచి ధమాకా

By udayam on January 12th / 10:26 am IST

‘ధమాకా’ చిత్రంతో మాస్ మహారాజా రవితేజ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ, యువ హీరోయిన్ శ్రీలీల నటన అందరికీ నచ్చింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ‘ధమాకా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తంతో హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ జనవరి 22 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

ట్యాగ్స్​