టెస్టుల్లో రెండో ర్యాంకుకు జడేజా

మూడో స్థానానికి పడిపోయిన కింగ్​ కోహ్లీ

అశ్విన్​, బుమ్రాలకు టాప్​ టెన్​లో స్థానం

By udayam on January 12th / 1:06 pm IST

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్​ సిరీస్​లో రాణించిన రవీంద్ర జడేజా ఆల్​ రౌండర్ల విభాగంలో రెండో స్థానానికి ఎగబాకాడు. 428 పాయింట్లతో ఉన్న జడేజా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్​ ఆల్​ రౌండర్​ బెన్​ స్టోక్స్​ 446 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

టెస్ట్​ బ్యాట్స్ మెన్​ స్థానంలో విరాట్​ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. మొదటి టెస్ట్​ తప్ప మిగతా టెస్టుల్లో అతడు ఆడకపోవడం ర్యాంక్​ దిగజారడానికి కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో మూడో టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీలు చేసిన స్టీవ్​ స్మిత్​ రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం కేన్​ విలియమ్సన్​ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలర్ల విభాగంలో టాప్​ టెన్​లో రవిచంద్రన్​ అశ్విన్​ 768 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుండగా.. జస్ప్రీత్​ బుమ్రా 765 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. ప్యాట్​ కమిన్స్​ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హేజిల్​వుడ్​ 5వ స్థానంలోనూ, మిచెల్​ స్టార్క్​ 8వ స్థానంలోనూ కొనసాగుతున్నారు.