ఐపిఎల్​కు దూరమైన జడేజా

By udayam on May 11th / 10:58 am IST

ఐపిఎల్​లో చెన్నై జట్టు కెప్టెన్సీకి మధ్యలోనే రాజీనామా చేసిన రవీంద్ర జడేజా ఇప్పుడు మిగతా ఐపిఎల్​ మ్యాచ్​లకు దూరమయ్యాడు. ఢిల్లీతో మ్యాచ్​కు జట్టులో లేని అతడికి గాయమైనట్లు సమాచారం. 33 ఏళ్ళ ఈ సౌరాష్ట్ర క్రికెటర్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఫీల్డింగ్​ చేస్తూ గాయపడ్డాడు. ఈ సీజన్​లో చెన్నై జట్టు మరో 3 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో అతడి ప్రదర్శన పట్ల ఆగ్రహంగా ఉన్న చెన్నై యాజమాన్యంతోనూ జడేజాకు మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం.

ట్యాగ్స్​