ఇంగ్లాండ్​ సిరీస్​కు జడేజా ఔట్​

By udayam on January 21st / 7:18 am IST

ఇంగ్లాండ్​తో స్వదేశంలో జరిగే సిరీస్​లకు భారత ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. ఈ సిరీస్​కు భారత్​ మొదటి రెండు టెస్టులకు నిన్న ప్రకటించిన ప్రాబబుల్స్​లో సైతం జడేజా పేరు లేకపోవడం గమనార్హం.

ఆసీస్​తో జరిగిన టెస్ట్​ సిరీస్​ సందర్భంగా మూడో టెస్ట్​ మొదటి ఇన్నింగ్స్​లో ఎడమచేయి బొటనవేలికి గాయం కావడం జడేజా ఈ సిరీస్​కు దూరం కావడానికి కారణంగా కనిపిస్తోంది.

అతడికి ఆస్ట్రేలియాలోనే శస్త్రచికిత్స చేసినప్పటికీ ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఇంగ్లాండ్​ సిరీస్​కు జడ్డూ దూరమయ్యాడు.

అయితే కేవలం టెస్ట్​ సిరీస్​కు మాత్రమే అతడిని దూరం పెట్టారా? లేదా టోర్నీ మొత్తానికి అతడిని బిసిసిఐ పరిగణనలోకి తీసుకోదా అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది.