ఫోన్​ పే కు ఆర్​బిఐ భారీ ఫైన్​

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​తో సహా 4 సంస్థలపై కొరడా

By udayam on November 21st / 1:20 pm IST

రెగ్యులేటరీ నియమాలను ఉల్లఘించారంటూ ఫోన్​ పే, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, సొడెక్సో, క్విక్​సిల్వర్​, ఢిల్లీ మెట్రే రైల్​ కార్పొరేషన్​, డిఎంఆర్​సి, ముత్తూట్​ ఫైనాన్స్​ కంపెనీలపై ఆర్​బిఐ అపరాధ రుసుం విధించింది.

మొత్తంగా రూ.5.78 కోట్ల అపరాధ రుసుంను ఈ కంపెనీలపై ఆర్​బిఐ విధించింది. వీటిల్లో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ తప్ప మిగిలినవి అన్నీ నాన్​ బ్యాంక్​ ప్రీపెయిడ్​ పేమెంట్​ ఇన్​స్ట్రుమెంట్​ సర్వీసులు.

సొడెక్సోకు రూ.2 కోట్లు, ఫోన్​ పే కి 1.39 కోట్లు, పిఎన్​బి, క్విక్​ సిల్వర్​ సొల్యూషన్లకు రూ. 1 కోటి, ముత్తూట్​ వెహికల్​ అండ్​ అసెట్​ ఫైనాన్స్​కు 34.55 కోట్లు, ఢిల్లీ మెట్రోకు రూ.5 లక్షల అపరాధ రుసం విధించింది.