బిట్ కాయిన్ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఊహాజనిత క్రిప్టో కరెన్సీల వల్ల స్థూల ఆర్థికానికి, ఆర్థిక స్థిరత్వానికి భారీ ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జరిగే ఎఫ్‌టీఎక్స్ ఎక్స్ఛేంజీ దివాలా తీసిందని ఆర్ బి ఐ గవర్నర్ గుర్తు చేసారు.