వడ్డీరేట్లు పెంచిన ఆర్​బిఐ

By udayam on May 4th / 10:14 am IST

కీలక వడ్డీరేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్​ పాయింట్లు పెంచిన ఆర్బీఐ ప్రస్తుతం రెపో రేటును 4.40 శాతానికి పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకు వడ్డీ రేట్లు, లోన్ల ఈఎంఐలు కూడా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఈ వడ్డీ రేట్లను పెంచుతున్నామని ఆర్​బిఐ ప్రకటించింది. 2018 ఆగస్ట్​ తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. మార్చి 2022లో హోల్ సేల్​ ద్రవ్యోల్బణ రేటు 7 శాతానికి పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్​