రెపో రేటును మళ్ళీ పెంచిన ఆర్‌బీఐ

By udayam on September 30th / 6:49 am IST

ఇతర బ్యాంకులకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు (రెపో)ను మరోసారి పెంచేసింది. ఈసారి 50 బేసిస్​ పాయింట్లు పెంచిన గవర్నర్​ శక్తికాంత దాస్​.. ఈ మార్పు తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.90 శాతానికి పెరిగింది. గత మూడేళ్లలో ఇదే గరిష్ట రెపో రేటు. ఆర్‌బీఐ ఈ ఏడాదిలో రెపో రేటును పెంచడం ఇది నాలుగోసారి. రెపో రేటు పెంపుతో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా ఇతర రుణాలు అన్ని మరింత భారంగా మారనున్నాయి.

ట్యాగ్స్​