భారత వృద్ధి రేటు 10.5 శాతం : ఆర్బీఐ

By udayam on April 7th / 10:08 am IST

భారత వృద్ధి రేటు ఈ ఆర్ధిక సంవత్సరంలో 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. ఈ ఏడాది తొలి త్రైమాసిక పరపతి విధాన కమిటీ సమావేశం ముగింపు సందర్భంగా కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దాంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్​ రెపో రేటు 3.3 శాతం వద్దనే ఆర్బీఐ ఉంచింది. పేమెంట్స్​ బ్యాంక్​లో నిల్వ ఉంచే మొత్తాన్ని లక్ష నుంచి 2 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్​