ప్రైవేట్​ బ్యాంకులకు ఆర్​బిఐ సై

రేసులో రిలయెన్స్​, ఆదిత్య బిర్లా, టాటా సన్స్​, టెక్​ మహీంద్ర

By udayam on November 21st / 9:59 am IST

దేశంలోనే అతిపెద్ద సంస్థలైన టాటా, బిర్లా, అంబానీ, మహీంద్రా వంటి సంస్థలు పేమెంట్​ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తలుపులు తెరిచింది.

ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్​ లైసెన్స్​లు ఇవ్వడానికి ఆర్​బిఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రిలయెన్స్​ ఇండస్ట్రీస్​, ఆదిత్య బిర్లా నువో, టెక్​ మహీంద్ర, టాటా న్స్​, సన్​ ఫార్మాలు ఇప్పటికే పేమెంట్​ బ్యాంక్​ల కోసం ఆర్​బిఐ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి.

అయితే ఇప్పుడు ఆర్​బిఐ సైతం వీటికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే దేశంలో ఉన్న ప్రైవేట్​ పేమెంట్​ బ్యాంకులైన హెచ్​డిఎఫ్​సి, ఐసిఐసిఐ వంటివి గట్టి పోటీని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి.

రేసులో రిలయెన్స్​, ఆదిత్య బిర్లా, టాటా సన్స్…

అయితే ఇలా ప్రైవేట్​ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సిన కంపెనీలు ఇప్పటికే దేశంలో పది సంవత్సరాల పాటు వ్యాపారాన్ని నిర్వహించిన అనుభవం ఉండాలని షరతు పెట్టింది. దాంతో పాటు వారి వ్యాపార నిర్వహణ స్థాయి సైతం రూ.50 వేల కోట్లకు పైనే ఉండాలని మరో షరతు పెట్టింది.

అయితే అతి పెద్ద సంస్థలైన ఆదిత్య బిర్లా గ్రూప్​, బజాజ్​ గ్రూప్​, మహీంద్రా అండ్​ మహీంద్ర, టాటా సన్స్​ వంటి సంస్థలు ఇప్పటికే దేశంలో చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తూ వారి వార్షిక వ్యాపరాన్ని సైతం రూ.50 వేల కోట్లకు పైనే నడుపుతుండడంతో వాటికి ఎలాంటి అడ్డంకులు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.