రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో సిద్ధమవుతున్న కొత్త చిత్రం #RC15. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ మూవీ కొత్త షెడ్యూల్ ను ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు సమాచారం. శంకర్ సంక్రాంతి తర్వాత వరకూ తన మరో చిత్రం ఇండియన్–2 పై పని చేసి ఆపై రామ్ చరణ్ మూవీ కోసం షెడ్యూల్ ను ఫిక్స్ చేస్తాడని తెలుస్తోంది. మరో 2 నెలల షూటింగ్ తో రామ్ చరణ్ మూవీని కంప్లీట్ చేయనున్నట్లు టాక్.