డిజైన్ పరంగా యాపిల్ ఐప్యాడ్ ప్రోను కాపీ కొట్టి రియల్మీ తన తొలి ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను రిలీజ్ చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ టాబ్లెట్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ టాబ్లెట్ల మార్కెట్లో దూసుకుపోతున్న షియామీ, సామ్‌సంగ్‌లను ఢీకొట్టడానికి రియల్మీ ఈ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. దీనికి సపోర్ట్ చేసే కీబోర్డ్, స్టైలస్లను సైతం విడుదల చేసింది. 4+64 జిబి ధర రూ.13 వేలు గా ఉండగా.. 6+128 జిబి ధర రూ.15999గా ఉండనుంది.