రంకేసిన బుల్​.. 3 లక్షల కోట్లు లాభాలు

By udayam on September 23rd / 11:40 am IST

అమెరికా ప్రభుత్వం వడ్డీరేట్లపై కోత విధిస్తున్న వార్త రావడంతో భారత స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్​ ఈరోజు ఏకంగా 958.03 పాయింట్లు పెరిగి 59,885 కు చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ సైతం 176.30 పాయింట్లు పెరిగి 17,822.95కు చేరింది. ఒక దేశలో సెన్సెక్స్​ 1030 పాయింట్లు లాభపడినప్పటికీ ఆ తర్వాత 958 పాయింట్లతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్​లో ఈరోజు రిలయెన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్​డిఎఫ్సి ట్విన్స్​, ఇన్ఫోసిస్​, ఐసిఐసిఐ బ్యాంక్​, ఎల్​అండ్​టిలు భారీగా ఆర్జించాయి. ఈ 5 కంపెనీలే ఏకంగా 750 పాయింట్ల పెరుగుదలకు కారణం.

ట్యాగ్స్​