అహ్మదాబాద్​ సరికొత్త రికార్డ్​

By udayam on May 30th / 9:02 am IST

ఐపిఎల్​ ఫైనల్​ మ్యాచ్​ జరిగిన అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ క్రికెట్​ స్టేడియం మరో రికార్డును నెలకొల్పింది. భారత్​లో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన క్రికెట్​ మ్యాచ్​గా రికార్డులకెక్కింది. రాజస్థాన్​, గుజరాత్​ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్​ ఫైనల్​కు ఏకంగా 1,04,859 మంది ప్రేక్షకులు తరలి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఫుల్​ కెపాసిటీతో మ్యాచ్​లు నిర్వహించడం, అందులోనూ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం, ఐపిఎల్​ ఫైనల్​ కావడంతో ఈ రికార్డు సాధ్యమైంది.

ట్యాగ్స్​