ఎపి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న రూ.11 కోట్ల ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. మే 10న రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 7 గురిని అరెస్ట్ చేశారు. అనంతరం 12వ తేదీ గురువారం నాడు మరో గూడ్స్ వ్యాన్లో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఈ కేసులో మరో 5 గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో ఉన్న సెంథిల్ కుమార్నే ఈ ముఠా నాయకుడని పోలీసులు గుర్తించారు.