50 ఎంపి కెమెరాతో రెడ్​మి 10 ప్రైమ్​

By udayam on September 3rd / 10:36 am IST

చైనీస్​ స్మార్ట్​ఫోన్​ కంపెనీ రెడ్​ మీ తన సరికొత్త మధ్య శ్రేణి స్మార్ట్​ఫోన్​ను ఈరోజు భారత్​లో లాంచ్​ చేసింది. రెడ్​మి 10 ప్రైమ్​ పేరుతో వస్తున్న ఈ ఫోన్​ 4+64 జిబి ధరను రూ.12,499గా పేర్కొంది. 50 ఎంపి కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రావైడ్​, 2 ఎంపి మేక్రో, 2 ఎంపి డెప్త్​ కెమెరాలు, 6.5 ఇంచ్​ ఐపిఎస్​ ఎల్​సిడి స్క్రీన్​, 6000 బ్యాటరీ కూడా ఈ ఫోన్​లో ఉండనున్నాయి. 6+128 జిబితో వచ్చే ఫోన్​ ధర 14,499గా పేర్కొంది. ఈనెల 7 నుంచి ఈ ఫోన్​ అమెజాన్​, షియామీ వెబ్​సైట్లలో అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్​