చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ తన నోట్ సిరీస్ లో 12వ వర్షన్ ను భారత్ లో వచ్చే నెల 5న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 200 ఎంపి కెమెరాతో రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర 24,999 నుంచి రూ.28,999 వరకూ ఉండనుంది. 6+128, 12+256 వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్ డి ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో+ పేరిట మూడు వర్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 5జి వర్షన్ లో వస్తున్న ఈ ఫోన్ కు ఇప్పటికే సూపర్ క్రేజ్ వచ్చేసింది.