రిలయెన్స్​ రికార్డ్​: 100 బిలియన్​ డాలర్ల రెవెన్యూ

By udayam on May 7th / 4:24 am IST

మార్చి నెలతో ముగిసిన 2021 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయెన్స్​ ఇండస్ట్రీస్​ 22.5 శాతం లాభాన్ని గడించింది. దీంతో ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని సాధించిన తొలి భారత కంపెనీగా చరిత్ర సృష్టించింది. టెలికాం, డిజిటల్​ సర్వీసుల్లో గణనీయ వృద్ధి కనిపించడంతో పాటు ఆయిల్​ రిఫైనింగ్​లో భారీ లాభాలు రావడంతో కంపెనీ లాభాల బాట పట్టింది. దీంతో 4వ త్రైమాసికంలో ఈ సంస్థకు రూ.16,203 కోట్ల లాభం వచ్చి చేరింది.

ట్యాగ్స్​