దిగ్గజ వ్యాపార సంస్థ రిలయెన్స్ ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్ట్‌లో 2 ర్యాంకులు మెరుగుపడింది. గతేడాది 55లో ఉన్న రిలయెన్స్‌కు ఈసారి 53వ ర్యాంక్ దక్కింది. భారత కంపెనీల్లో ఇదే బెస్ట్ ర్యాంక్. రిలయెన్స్ తర్వాత ఎస్బిఐ బ్యాంక్, ఆ తర్వాత ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి లు చోటు దక్కించుకున్నాయి. గౌతమ్ అదానీ కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలకూ చోటు దక్కింది. మరో కంపెనీ వేదాంత 703 ర్యాంకులు మెరుగుపరచుకుంది.