ఆంధ్రప్రదేశ్ లో జియో తన 5జి సేవల్ని నిన్నటి నుంచి ప్రారంభించింది. ముందుగా రాష్ట్రంలోని పెద్ద నగరాలైన తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ల్లో ఈ సేవల్ని సోమవారం (26) నుంచి అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో 5జి సేవల కోసం జియో రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది సమయంలోనే రాష్ట్రంలోని ప్రతీ మండలం, తాలూకా, గ్రామాల్లోనూ 5జి సేవలు ప్రారంభమవుతాయని జియో ప్రతినిధులు వెల్లడించారు.