దేశీయ రిటైల్ రంగ వ్యాపారంలో మరింత బలోపేతం అయ్యే దిశగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ముందడుగు వేసింది. జర్మనీ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో ‘మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా’ నిర్వహిస్తున్న టోకు వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్ చేజిక్కించుకుంది. ఈ కొనుగోలు విలువ రూ.2,850 కోట్లు. పూర్తిగా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం కుదిరింది.