న్యూఢిల్లీ: సాధారణంగా విదేశాల్లో నివశించే ఎన్నారైలకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉంటాయి. వీటిని రెన్యువల్ కోసం ప్రతిసారీ భారత ఎంబసీనో లేక వాళ్లు నివశిస్తున్న దేశాల్లోని పథకాల ద్వారానో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
అయితే ఇకపై వారికి ఇలాంటి ఇబ్బందులు అవసరం లేదని భారత దేశ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది.
విదేశాల్లో ఉండే భారతీయులు తమ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లను ఆయా దేశాల నుంచే రెన్యూవల్ చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే భారత్లో ఐడీపీ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మెడికల్ సర్టిఫికెట్, వీసా ఉండాలనే నిబంధనను కూడా తొలగించినట్లు వెల్లడించింది.