5:26 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ప్యాన్‌ ఇండియా మూవీతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ 2 weeks ago

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. బద్రి, జానీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్‌ ‘ఆద్య’ అనే ఒక పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌ ప్యాన్‌ ఇండియా మూవీతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కి రెడీ అయ్యారు. ఈ సినిమాతో ఎం.ఆర్‌.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

బాలీవుడ్‌ హీరో వైభవ్‌ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని డి.ఎస్‌.కె. స్క్రీన్‌–సాయికృష్ణ ప్రొడక్షన్స్  బ్యానర్స్‌పై రావ్‌. డి.ఎస్‌.రజనీకాంత్‌. ఎస్‌ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గా  కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్‌ వ్యవహరిస్తున్నారు. ఇక ‘హుషారు’ ఫేమ్‌ తేజ కురపాట, గీతికా రతన్‌ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్‌ సాయి ధన్సిక, నందినీ రాయ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.