ప్రపంచంలోనే అత్యంత పొడవైన మొక్కను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీని వయసు దాదాపు 4,500 ఏళ్ళు అని చెప్పిన శాస్త్రవేత్తలు దాని పొడవు 180 కి.మీ.ల మేర విస్తరించినట్లు లెక్కగట్టారు. ఇదే ప్రపంచంలోనే అత్యంత పురాతన మొక్కగానూ వారు అభివర్ణించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని షార్క్ తీరంలో నీటి అడుగున దీనిని కనిపెట్టారు. దీని వైశాల్యం 20 వేల రగ్బీ మైదానాలతోనూ, గ్లాస్గో నగరం కంటే పెద్దగానూ, మాన్‌హట్టన్ ఐలాండ్‌కు మూడు రెట్లు సైజులోనూ ఈ మొక్క ఉందని తెలిపారు.
Our researchers have discovered the world's largest plant in our very own Shark Bay. The seagrass is dated to be 4,500 years old, stretching across 180km😲🌱🌊 #UWA pic.twitter.com/EgQu8ETBSF
— UWA (@uwanews) June 1, 2022