అమిత్ షా ఏపీ పర్యటనకు ముందు రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న తుమ్మల ఆంజనేయులు, కుమార స్వామిలు తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు ఇచ్చేశారు. ఇటీవల ఆరు రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు పార్టీ అధ్యక్షుల మార్పు జరగడంపై ఈ విభేదాలు బయటకొచ్చాయి. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిజెపి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.