కేరళలోని ఓ రెస్టారెంట్ నుంచి ఆహారం ఆర్డర్ చేసుకున్న 21 మందికి ఫుడ్ పాయిజన్ జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ మరణించారు. గత నెల 30న ఆ రెస్టారెంట్ నుంచి బార్బిక్యూ చికెన్ తో పాటు ఆహారాన్ని ఓ మహిళ ఆర్డర్ చేసుకున్నారు. ఆ హారం తిన్న తర్వాత ఆమె ఆసుపత్రి పాలై.. జనవరి 2న మరణించారు. అంతర్గత అవయవాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె మరణించినట్లు ప్రాథమిక పోస్టుమార్టంలో తేలింది. అదే రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న పలువురు అనారోగ్యం పాలైనట్లు నివేదికలు వచ్చాయి.