తెలంగాణలో జరగనున్న వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపిగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన 9 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొడంగల్లో 75 వేల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న అనంతరం జరిగిన థ్యాంక్స్ మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.