రేవంత్​: 26 నుంచి పాదయాత్ర చేస్తున్నా

By udayam on January 7th / 6:25 am IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 26 నుండి పాదయాత్ర చేయనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై మూడు ప్రాంతాలు పరిశీలనలో వున్నాయని తెలిపారు. భద్రాచలం, జోడేఘడ్, జోగులాంబ వీటిలో ఏదోఒకటి ప్లేస్ ఫైనల్ అవుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జీ వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 19 కిలోమీటర్లు, 126 రోజులు యాత్ర ఉంటదని తెలిపారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు.

ట్యాగ్స్​