ఇక రేవంత్​ ‘యాత్ర’

By udayam on December 19th / 10:23 am IST

సంక్షోభం వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ‘యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో పాదయాత్ర లోగో ఆవిష్కరించారు.వచ్చే ఏడాది జనవరి 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​