ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ పర్యటన కోసం నిరసన తెలిపి జైలు పాలైన విద్యార్థులను టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు ఉదయం చంచల్గూడ జైలుకు వెళ్ళిన ఆయన ఓయూ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితోనే రాహుల్ పర్యటనకు యూనివర్శిటీ ప్రతినిధులు అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కాంగ్రెస్ అధినాయకత్వానికి వీసీ అనుమతివ్వకపోవడం దారుణమని విమర్శించారు.