పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యపై శుక్రవారం కీలకభేటీ జరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు, పర్యావరణ అనుమతులను ఏపీ పాటించడంలేదని తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ లు సుప్రీంను ఆశ్రయించాయి. దీంతో సుప్రీం పోలవరం బాగస్వామ్య రాష్ట్రాలతో చర్చించి పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని కేంద్ర జలసంఘాన్ని గత ఏడాది సెప్టంబర్‌లో ఆదేశించింది. పోలవరంలో 150 అడుగులమేర నీటిని నిల్వచేస్తే భద్రాచలంతో మరో 100 గ్రామాలు మునిగిపోతాయని..2022లో గోదావరికి వచ్చిన వరదలను కారణంగా చెబుతూ తెలంగాణ అభ్యంతరం తెలిపింది.