ఖడ్గ మృగంపై వేటగాళ్ళ దారుణం

By udayam on May 14th / 7:37 am IST

అస్సాంలోని ఒరాంగ్​ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న ఓ మగ ఖడ్గ మృగం రక్తమోడుతున్న ఫొటోలపై కేసు నమోదైంది. ఈ ఖడ్గ మృగం కొమ్ముని వేటగాళ్లు కోసేశారని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటోందని తెలిపారు. చికిత్స పూర్తయిన తర్వాత ఈ రైనోను తిరిగి అడవిలోకి వదులుతామని తెలిపారు. 2017 తర్వాత రైనో లపై ఈ అటవీ ప్రాంతంలో దాడి జరగడం ఇదే తొలిసారి.

ట్యాగ్స్​