నోరు జారడం ఎందుకు.. సారీ చెప్పడం ఎందుకు రిచా?

By udayam on November 24th / 10:37 am IST

బాలీవుడ్ నటి రిచా చద్దా భారత సైన్యానికి క్షమాపణ చెప్పింది. గాల్వాన్‌పై ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపడంతో రిచా చద్దా క్షమాపణలు కోరింది. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం తనకు లేదని, తన ట్వీట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నానని వివరణ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందని లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ ప్రకటన చేశారు. దీనిపై స్పందిస్తూ రిచా ట్విట్టర్ లో ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అని ట్వీట్ చేసింది. ఇది భారత భారత సైన్యాన్ని ఎగతాళి చేసేలా, గాల్వాన్ ఘర్షణలో భారత జవాన్ల త్యాగాన్ని తక్కువ చేసేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ట్యాగ్స్​