రాజస్థాన్​పై కోల్​కతా ఘన విజయం

By udayam on May 3rd / 5:24 am IST

వరుసగా 5 ఓటముల తర్వాత కోల్​కతా నైట్​ రైడర్స్​ ఘన విజయాన్ని నమోదు చేసింది. నిన్న రాత్రి రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టేసింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​ను కోల్​కతా బౌలర్లు కేవలం 152 పరుగులకే కట్టడి చేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని కోల్​కతా బ్యాటర్లు 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేధించింది. నితీష్​ రాణా 48, రింకూ సింగ్​ 42, శ్రేయస్​ అయ్యర్​ 34 పరుగులతో ధాటిగా ఆడారు.

ట్యాగ్స్​