ఆదివారం జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో ఫ్రాన్స్ ఓటమి పాలైన విషయం విదితమే. ఈ ఓటమితో ఆ దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రాజధాని పారిస్, నైస్, లియోన్ వంటి అనేక నగరాల్లో భారీగా జనాలు వీధుల్లోకి వచ్చి, వాహనాలు అడ్డుకున్నారు. వారిని అడ్డుకునే పోలీసుల ప్రయత్నాలు విఫలమైయ్యాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ… టపాసులు కాల్చారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫైనల్లో ఫ్రాన్స్ 3–3తో సమంగా నిలిచిన షూటౌట్లో 4–2 తేడాతో ఓడిపోయింది.