ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా డెహ్రాడూన్ హైవే పై హమ్మద్ పూర్ జల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన క్రికెటర్ రిషబ్ పంత్ ను కొందరు దొంగలు దోచుకున్నారు. అతడితో పాటు కారులో ఉన్న బ్యాగ్ లో కొంత నగదు ఉండేదని, దానిని కొందరు పట్టుకుపోవడం చూశానని పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్ సుశీల్ తెలిపాడు. అతడి మిగతా వస్తువులు, ఉంగరాలు, చైన్లను మాత్రం రోడ్డుపై నుంచి ఏరి అతడికి తిరిగి అప్పగించేశామని అతడు వెల్లడించాడు.
Watch the moment when Indian Star Cricketer Rishabh Pant escaped his burning car & was saved by locals near Roorkee while he was returning from Delhi to Uttarkhand. #RishabhPant pic.twitter.com/X4r1o7j7AK
— Jan Ki Baat (@jankibaat1) December 30, 2022