పంత్​లో కోహ్లీ లక్షణాలు ఉన్నాయి : పాంటింగ్​

By udayam on April 14th / 2:15 pm IST

ఢిల్లీ క్యాపిటల్స్​ కొత్త కెప్టెన్​ రిషబ్​ పంత్​లో ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్ళైన కోహ్లీ, విలియమ్సన్​లలో ఉండే లక్షణాలే ఉన్నాయని ఢిల్లీ కోచ్​ పాంటింగ్​ ప్రశంసించాడు. వారికి లాగే మ్యాచుల్ని ముగించగల గొప్ప లక్షణం పంత్​లోనూ ఉందన్న పాంటింగ్​ భారత వికెట్​ కీపర్​గా అతడికి 10 నుంచి 12 ఏళ్ళ భవిష్యత్తు ఉందని చెప్పాడు. ‘ప్రతి ఒక్కరికీ పంత్​ కీపింగ్​ పట్ల ప్రశ్నలు ఉన్నాయి. అయితే వాటిని అధిగమించడానికి పంత్​ చేస్తున్న ప్రయత్నాలు నేను దగ్గరుండి చూస్తున్నా. అదే సమయంలో అతడో అద్భుత బ్యాట్స్​మెన్​’ అని పాంటింగ్​ మెచ్చుకున్నాడు.

ట్యాగ్స్​