నా జీవితంలో అద్భుతక్షణాలు ఇవి

సిరీస్​ విజయంపై స్పందించిన రిషబ్​ పంత్​

కీలక సమయాల్లో చేజార్చుకున్నామన్న టిమ్​ పైన్​

By udayam on January 19th / 10:45 am IST

1988 తర్వాత గబ్బా వేదికగా జరిగిన ఓ టెస్ట్​ మ్యాచ్​లో తొలిసారిగా ఆస్ట్రేలియా ఓడిపోవడం, ఆ విజయంలో తానూ కీలక ఇన్నింగ్స్​ ఆడడం నా జీవితంలో అద్భుతమైన క్షణాలని రిషబ్​ పంత్​ అన్నాడు.

ఇక్కడ నా జీవితంలో అద్భుతమైన విషయాలు జరిగాయి. ముందు టెస్టుల్లో నేను సరిగ్గా ఆడకపోయినా నా వెంటే ఉన్న నా తోటి టీమ్​ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నా. 5వ రోజు ఆటలో బాల్​ బాగా స్పిన్​ అవుతోంది. నేను జాగ్రత్తగా ఆడాలని ముందుగానే అనుకున్నా. ప్రణాళికలు ఫలించాయి అని పేర్కొన్నాడు.

కీలక సమయాల్లో మ్యాచ్​లు వదిలేశాం

మ్యాచ్​ ఓటమి అనంతరం స్పందించిన ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​.. సిరీస్​ మొత్తంలోనూ మేం వరుస తప్పిదాలు చేస్తూనే వచ్చామని చెప్పాడు.

కీలక సమయాల్లో మ్యాచ్​లు మా చేజారిపోయేలా మైదానంలో మా ప్రవర్తన ఉందని నిరాశ వ్యక్తం చేశాడు. ‘‘బౌలింగ్​లోనూ, బ్యాటింగ్​లోనూ మేం చాలా సార్లు సిరీస్​ మొత్తంలో విఫలమవుతూనే వచ్చాం. మాకు ఈ సిరీస్​లో ఇది ఓ అలవాటుగా మారిపోయింది’’ అని అభిప్రాయపడ్డాడు.