టీమ్‌ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఆరోగ్యంపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ స్పందించాడు. కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పంత్ ఆరోగ్యం కుదటపడడంతో ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిన్న సాయంత్రం అతడిని ప్రైవేటు వార్డుకు షిఫ్ట్ చేశారని తెలిపారు. కాలి లెగ్మెంట్ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపాడు. ఈ నేపథ్యంలో క్రికెటర్లు, అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.